అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అయిన శ్రీ విశ్వ భూషణ్ హరి చందన్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఆయన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా ఆయన శరీరం చికిత్సకు బాగా సహకరించడం వల్ల ఆయన పూర్తిగా కోలుకున్నారు. గవర్నర్ ఆరోగ్యం పూర్తిగా మెరుగవడంతో ఆయనను మంగళవారం రాత్రి డిశ్చార్జి చేశామని హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.
ఇటీవలే ఆయన కోవిడ్ అనంతర సమస్యలతో బాధ పడుతున్నందున వారం క్రితం ఏఐజీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆక్సిజన్ స్థాయి, ఇతర ఆరోగ్య ప్రమాణాలు అన్నీ సాధారణ స్థితికి రావడం వల్ల ఆయనను మంగళవారం డిశ్చార్జ్ చేశారు.