విజయవాడ: తెలుగు రాష్ట్రాల నుండి కేరళలోని శబరిమలకు వేళ్లే భక్తులు మరియు ప్రమాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాల నుండి శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడుపబోతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
ప్రత్యేక రైళ్ళ వివరాలు ఇలా:
సికింద్రాబాద్ నుండి కొల్లం ప్రత్యేక రైలు (07133) ఈ నెల 18వ తేదీన ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07134) ఈ నెల 19న సాయంత్రం 7.35 గంటలకు కొల్లంలో బయలుదేరి, రెండోరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
కాచిగూడ–కొల్లం ప్రత్యేక రైలు (07135) ఈ నెల 22వ తేదీన ఉదయం 5.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07136) ఈ నెల 23న సాయంత్రం 7.35 గంటలకు కొల్లంలో బయలుదేరి, రెండోరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
నాందేడ్–కొల్లం ప్రత్యేక రైలు (07137) ఈ నెల 23న ఉదయం 9.45 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 9.40 గంటలకు కొల్లం చేరుకుంటుంది. కొల్లం–తిరుపతి ప్రత్యేక రైలు (07506) ఈ నెల 25న (శనివారం) మధ్యరాత్రి 12.45 గంటలకు కొల్లంలో బయలుదేరి, అదే రోజు సాయంత్రం 5.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.