హైదరాబాద్: నీది నాది ఒకే కథ, విరాటపర్వం సినిమాలతో తనది ప్రత్యేక శైలి అని నిరూపించుకున్న దర్శకుడు వేణు ఊడుగుల. ప్రస్తుతం ఈ దర్శకుడు రానా నటిస్తున్న విరాటపర్వం సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘విప్లవం అనేది అమితమైన ప్రేమ నుండి ఉద్భవిస్తుందని చెప్పే కథ ఇది’ అని ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. తాను ప్రస్తుతం చేస్తున్న విరాట పర్వం షూటింగ్ ఇంకా పది శాతం మిగిలి ఉందని, దాని కోసం ఎక్కువ మందితో షూటింగ్ చేయాల్సి వస్తుందని పరిస్థితులు సహకరించినపుడు చేయాలి అని ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. అలాగే తన తదుపరి సినిమా కూడా 1995 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తీస్తానని, 14 రీల్స్ బ్యానర్ పైన రామ్ ఆచంట , గోపి ఆచంట నిర్మించనున్నారు. ఇప్పటికి అయితే ఈ సినిమాకి ఇంకా హీరో ఫిక్స్ అవలేదని చెప్పారు.
అల్లు అరవింద్ సొంత ఓటీటీ అయిన ‘ఆహా’ లాంచ్ అయినపుడు కొంచెం వీక్ గా ఉన్నా కూడా లాక్ డౌన్ ని ఉపయోగించుకొని కొత్త సినిమాలు ఆడ్ చేయడం వాళ్ళ, కొత్త సిరీస్ లు ప్లాన్ చేస్తుండడం తో ఆహా సబ్ స్క్రిప్షన్స్ కూడా ఊపందుకున్నాయి. ఇప్పటికే ఆహా కోసం చాల మంది డైరెక్టర్స్ కథలు , వెబ్ సిరీస్ లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి వేణు ఊడుగుల కూడా ఆడ్ అయ్యారు. దీనిని చలం రచించిన ‘మైదానం’ ఆధారంగా తెరకెక్కించనున్నట్టు తెలిపారు. కానీ ఈ వెబ్ సిరీస్ కి తాను డైరెక్టర్ గా కాకుండా ప్రొడ్యూసింగ్ చేస్తున్నట్టు చెప్పారు. దీనిపై మరిన్ని అప్ డేట్స్ త్వరలో వెల్లడించనున్నట్టు తెలిపారు. భవిష్యత్తు లో సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు కూడా చెప్పారు.