హైదరాబాద్: తెలంగాణ లో ఒక్క సారిగా ఒమిక్రాన్ కేసులు పెరిగాయి. ఈ రోజు ఒక్కటే రాష్ట్రంలో 14 ఒమిక్రాన్ కేసులు నమోదవడం తీవ్ర కలకలం రేపుతోంది. కాగా ఈ 14 కేసులన్నీ విదేశాల నుండి వచ్చిన వారివే కావడం గమనార్హం.
తాజా ఈ 14 కేసులతో కలిపి ఇప్పుడు తెలంగాణ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38 కి చేరుకుంది. కాగా పాజిటివ్ గా పరీక్షించబడిన వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లను ట్రేస్ చేసి వారికి కూడా టెస్టులు చేస్తున్నారు అధికారులు.
ఇదిలా ఉండగా ఈ నెల 18న ఆ ఆరుగురికీ ఒమిక్రాన్ వేరియంట్ కరోనా సోకినట్లు నిర్ధారణ అవడంతో వారు ఇచ్చిన చిరునామాలకు అధికారులు వెళ్లగా అక్కడ వారికి ఎటువంటి ఆచూకీ లభించలేదు. ఎట్టకేలకు ఎలాగోలా నలుగురిని మంగళవారం రాత్రి గుర్తించి ఆస్పత్రులకు తరలించారు. మిగిలిన ఇద్దరి కోసం అధికారులు వెతుకుతున్నారు.