న్యూఢిల్లీ: కరోనా వైరస్ లో చిక్కుకుని గడిపిన కొన్ని నెలల జీవితాన్ని ప్రజలంతా ఒకసారి ఆత్మశోధన చేసుకోవాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవు పలికారు. ఏదైనా అనుకోని విపత్తు వస్తే తగిన సన్నద్ధతో ఉన్నామా లేదా అన్నది ప్రజలు, ప్రభుత్వాలు తమను తాము ప్రశ్నించుకోవాలన్నారు.
కోవిడ్-19 కారణాలు, పర్యవసానాలపై తన భావనాలను వెంకయ్యనాయుడు ఫేస్ బుక్ ద్వారా ప్రజలకు వెల్లడించారు. ‘కరోనా కాలంలో జీవిత భావనలు ‘ అనే శీర్షికతో వెంకయ్యనాయుడు తన అభిప్రాయాలను సంభాషణాశైలిలో వ్యక్తపరిచారు. ఈ సంధర్భంగా ఆయన పది ప్రశ్నలను సంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలే పలు జీవిత సత్యాలను నేర్పుతాయన్నారు.
కరోనా మహమ్మారి వలన దాదాపు 4 నెలలు ఇళ్ళకే పరిమితమైన నేపథ్యంలో జీవితంలో నేర్చుకున్న పాఠాలను, మార్పులను ఒకసారి పరిశీలించుకోవడానికి ఉపయోగపడతాయి. కరోనాను కేవలం ఒక వైపరీత్యంగానే కాకుండా ఒక దిద్దుబాటుదారుగా, ఒక సంఘ సంస్కరణ కర్తగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
గడచిన కొన్ని సంవత్సరాల కాలంలో ప్రజలు, ప్రభుత్వాలు కాలంతో పోటీ పడి జీవితాన్ని పరుగులు పెట్టంచారు, ఈ కరోనా కాలంలో మాత్రఒ ఆ అతృత కనిపించలేదన్నారు. సరైన ఆలోచన, జీవన విధానం, ఆరోగ్యమైన ఆహారం ఔషధంగా పరిగణించడం, సామాజిక బంధంతో ఒక సరైన జీవన విధానం అలవరచుకోవడం వంటి సూచనలను ఆయన అందులో పొందుపరచారు.
మొత్తం భూగోళం మనుషులదే అన్నట్లుగా పెత్తనం చెలాయించడం వల్ల ప్రకృతి సమతుల్యం దెబ్బతినిందని, మనమంతా సమానులుగా పుట్టాం, ప్రకృతిని సమానంగా ఇతర జీవులతో కలిసి కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఈ విపత్తు తెలియజేసిందన్నారు.