సెంచూరియన్: భారత్ దక్షిణాఫ్రికా మధ్య సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా బౌలర్లపై క్రమానుగతంగా పరుగులు చేస్తున్న భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ మరియు మయాంక్ అగర్వాల్ తమ రెండో ఇన్నింగ్స్‌ను బలంగా ప్రారంభించారు.
మంగళవారం తొలి ఇన్నింగ్స్‌లో భారత్ దక్షిణాఫ్రికాను 197 పరుగులకు ఆలౌట్ చేసి 130 పరుగుల ఆధిక్యంతో ఉంది. టెస్ట్ క్రికెట్‌లో తన 200 వికెట్ల మైలురాయిని షమీ ఇవాల తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టి సాధించాడు. షమీతో పాటు జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు.
దక్షిణాఫ్రికా తరఫున టెంబా బావుమా 52 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అంతకుముందు ఎన్‌గిడి ఆరు వికెట్లు పడగొట్టాడు, మొదటి టెస్టులో 3వ రోజు భారత్ బ్యాటింగ్ కుప్పకూలింది. మంగళవారం కేవలం 55 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి 327 పరుగులకే కుప్పకూలింది.