సిడ్నీ: సిడ్నీ లో జరుగుతన్న యాషెస్ నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ జానీ బెయిర్‌స్టో అధ్బుత సెంచరీతో చెలరేగి ఆడాడు. బెయిర్ స్టో తన ఇన్నింగ్స్ లో 140 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌ల సహాయంతో 103 పరుగులు సాధించి ఆజేయంగా ఆడుతున్నాడు.
అయితే ఈ సంవత్సరం యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ తరుపున బెయిర్‌స్టో తొలి సెంచరీని నమోదు చేశాడు. 13 పరుగుల వద్ద జీరో వికెట్లతో ఓవర్‌నైట్ స్కోర్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్, ఆదిలోనే ఓపెనర్ హమీద్ వికెట్‌ను కోల్పోయింది. తరువాత 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
ఈ తరుణంలో స్టోక్స్‌తో కలిసి బెయిర్‌స్టో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను నిదానంగా నిలబెట్టాడు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్ కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బెయిర్‌స్టో (103), లీచ్(4) పరుగులతో క్రీజులో ఆడుతున్నారు.