క్రైస్ట్‌చర్చ్: క్రైస్ట్‌చర్చ్ లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు ఎబాదత్ హొసేన్ బ్యాటింగ్ లో ఒక చెత్త రికార్డును నమోదు చేశాడు. గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కటంటే ఒక్కసారి కూడా పరుగుల ఖాతా తెరవని తొలి అంతర్జాతీయ క్రికెటర్ గా హొసేన్ రికార్డుల్లోకి ఎక్కాడు.
హొసేన్ కంటే ముందు న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ మార్టిన్, శ్రీలంక ఆటగాడు లహీరు కుమార వరుసగా 9 ఇన్నింగ్స్‌ల్లో సున్నా పరుగులకే పరిమితం కాగా, తాజాగా వారి రికార్డును హొసేన్ చెరిపేశాడు. గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఎబాదత్ హొసేన్ 7 సార్లు ఖాతా తెరవకుండానే నాటౌట్‌గా నిలవగా 3 సార్లు మాత్రం డకౌట్ అయి ఈ రికార్డు నెలకొల్పాడు.
దీనితో పాటు హొసేన్ ఇంకో అవమానకర రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్‌ల్లో 16 ఇన్నింగ్స్‌ల తర్వాత అతి తక్కువ పరుగులు చేసిన క్రికెటర్‌గా కూడా రికార్డు నమోదు చేశాడు. ఇప్పటివరకు 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన హొసేన్, 16 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. 2019లో భారత్‌తో జరిగిన కోల్‌కతా టెస్ట్‌లో చేసిన 2 పరుగులే అతనికి అత్యధికం.