హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న ఉపాధ్యాయ బదీలలో విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఉపాధ్యాయ బదిలీలను సీనియార్టీ ప్రాతిపాదికన చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అందుకు ఈ ఉపాధ్యాయ బదిలీలపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని జూనియర్ కాలేజీల అధ్యాపకుల సంఘం ఇవాళ అకస్మాత్తుగా ముట్టడించింది. వారంతా తెలంగాణ విద్యా శాఖ మంత్రి ఇంటి ముందు బైఠాయించి బదిలీలకు కారణమైన విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
కాగా వారు ఈ మొత్తం బదిలీల విషయంపై ప్రభుత్వం సమీక్షించాల్సిగా వారు మంత్రి ని కోరారు. బదిలీల్లో అవకతవకలు జరిగాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీంతో మంత్రి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతారణం నెలకొంది.