హైదరాబాద్: దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని స్పష్టంగా తెలుస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి కరోనా వైరస్ సోకింది.
ఆయనకు కరోనా లక్షణాలైన జలుబు మరియు నలతతో ఇబ్బంది పడుతుండగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లో కరోనా పరీక్ష చేయించుకున్నారు. తనకు చేసిన యాంటిజెన్ టెస్టులో నెగెటివ్ వచ్చింది, అయితే తిరిగి మంగళవారం ఉదయం ఆర్‌టీపీసీఆర్ టెస్టు రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
పాజిటివ్ తెలడంతో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో హోమ్ ఐసోలేషన్‌లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆయనను ఇటీవల వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు. కాగా మంత్రి ఆరోగ్యం విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని, కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు మంత్రి సన్నిహితులు తెలిపారు.