న్యూఢిల్లీ: భారత టెస్ట్ క్రికెట్ సారధిగా ఉన్న విరాట్ కోహ్లి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియాకు టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి తాను వైదొలుగుతున్నట్లు తన ట్విటర్ అకౌంట్ ద్వారా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో 7 సంవత్సరాల తన కెప్టెన్సీ ప్రయాణంలో తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. కెప్టెన్‌గా అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కూడా కోహ్లీ కృతగ్నత తెలిపాడు.
తన ట్వీట్ లో తనకు ఇన్నాళ్ళ అండగా నిలిచిన రవిశాస్త్రికి, మహేంద్ర సింఘ్ ధోనికి ధన్యవాదాలు తెలిపాడు. తాను ఇన్నాళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, కెప్టెన్సీ వదులుకునేందుకు ఇదే సరైన సమయం అని కెప్టెన్సీ ఎప్పటికైనా వదులుకోక తప్పదని తెలిపాడు.
కాగా కోహ్లీ ఈ నిర్ణయం పై బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. కోహ్లీ కెప్టెన్సీ లో భారత క్రికెట్ టీం ను అన్ని ఫార్మాట్లలోనూ అగ్రపథంలో నిలపడంలో విరాట్ ఎనలేని కృషి చేశాడని కొనియాడాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం తన వ్యక్తిగత నిర్ణయమని, బీసీసీఐ తన నిర్ణయాన్ని గౌరవిస్తుందని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.