న్యూఢిల్లీ: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశ ఉభయ సభలను ఉద్ధేశించి ప్రసంగించడంలో బడ్జెట్ సమావేశాలకు తెర లేచింది.
ఈ క్రతువుత్తో బడ్జెట్‌కు ముందు ఎంతో కీలకంగా పరిగణించే ఆర్థిక సర్వే 2021-22ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతరామన్ లోక్‌సభ లో ప్రవేశ పెట్టారు. ఈ ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వే సింగిల్ వాల్యూమ్‌గానే రానున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపు 9 శాతం వృద్ధిని అంచనా వేసింది. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్యసభ ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక సర్వే బయటకు వస్తుంది. కాగా బడ్జెట్-2022కు ముందు ఆర్థిక సర్వే ఎంతో కీలకంగా మారనుంది.