ముంబై: భారత లెజెండరీ సినీ గాయకురాలైన లతా మంగేష్కర్ (92) అస్వస్థతతో స్వర్గస్థులయ్యారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో ఆదివారం 8గం.12నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు సమాచారం అందించారు. ఆమె గత 29 రోజులుగా ఆమె హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
లతా మంగేష్కర్ క్రితం నెల 8వ తేదీన కరోనాతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తరువాత ఆమె కరోనా నుంచి రికవరీ అయినప్పటికీ వెంటిలేటర్‌పై కొన్నాళ్లు చికిత్స పొందారు. ఈ క్రమంలో ఆమె కోలుకుంటున్నట్లు కూడా ఈమధ్యనే వైద్యులు కూడా ప్రకటించారు. కానీ పరిస్థితి మళ్ళీ విషమించడంతో ఆమెను మళ్లీ వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స అందించారు.
నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బిరుదు పొందిన ఆమె, దాదాపు 20 భాషల్లో 50 వేలకు పైగా పాటలను పాడారు. హిందీ చిత్రసీమలో లతా మంగేష్కర్ పాటలు నాటికి నేటికి ఎంతో మంది శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. ఆమె లేరనే వార్తతో శోక సముద్రంలో మునిగిపోయారు సినీ సంగీత అభిమానులు.