న్యూఢిల్లీ: భారత దేశ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అయిన మీషో తన ఉద్యోగులకు ఒక పెద్ద శుభవార్త తెలిపింది. తమ కంపెనీ ఉద్యోగులు దేశంలో ఎక్కడి నుండైనా పని చేయవచ్చు అని ఆ సంస్థ ప్రకటించింది. ఈ విషయమై మీషో వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్ ఆత్రే తన ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని పేర్కొన్నారు.
మేము శాశ్వతంగా సరిహద్దులేని పని విధానాన్ని అవలంబిస్తున్నాము. ఇక మా కంపెనీ ఉద్యోగులు సౌకర్యవంతంగా పనిచేసుకోవచ్చు అని ఆయన తెలిపారు. ఈ అనిశ్చిత ప్రపంచంలో, వ్యాపార వృద్ధి వాస్తవానికి స్థితిస్థాపక మరియు ఉత్పాదక శ్రామిక శక్తిపై ఆధారపడి ఉంటుందని నిర్ధారించడానికి మేము చాలా నమూనాలను అధ్యయనం చేశాము! అని ఆయన తన ట్వీట్ లో తెలిపారు.
తమ కంపెనీ ఉద్యోగుల మానసిక, శారీరక భద్రత మరియు వారు పని చేసే స్థానం కంటే చాలా ముఖ్యమని వ్యాపారాధినేతలు అంగీకరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మీషో అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో చిన్న కార్యాలయాలను తెరుస్తుందని, ప్రధాన కార్యాలయం మాత్రం బెంగళూరు నగరంలోనే కొనసాగుతుందని ఆత్రే తెలిపారు.