హైదరాబాద్: గత నెలలో భారత దేశంలో కరోనా కేసులు ఒక్క సారిగా పెరుగుదల నమోదు చేశాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు అమాంతం పెరిగాయి. దీంతో ప్రజలు భయపడ్డారు, అధికారులు అప్రమత్తమయ్యారు.
కాగా తాజాగా తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం రాష్ట్రంలో 61,573 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించాగా, అందులో కేవలం 865 మంది మాత్రమే వైరస్ బారిన పడ్డారు. అంటే కోవిడ్ పాజిటివిటీ రేటు కేవలం 1.40 శాతంగా నమోదైంది.
కాగా 2020 లో కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసులు 7.80 లక్షలు నమోదయ్యాయి. తాజాగా గత 24 గంటల్లో 2,484 మంది కోలుకోగా, మొత్తం 7.56 లక్షల మంది కోలుకున్నారు. ఒక్క రోజులో కరోనాతో ఒకరు చనిపోగా, ఇప్పటివరకు వైరస్‌కు 4,103 మంది బలయ్యారు.