హైదరాబాద్: బంగారం ప్రియులకు ఒక షాకింగ్ న్యూస్. బంగారం ధరలు చాలా వేగంతో దూసుకెళ్తున్నాయి. కేవలం ఒక్క రోజులోనే బంగారం ధర దాదాపుగా రూ.600కి పైగా పెరగడం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న పెళ్లిళ్ల సీజన్ ఒక వైపు మరో వైపు అంతర్జాతీయంగా బంగారనికి డిమాండ్ పెరగడంతో మన దేశంలో ధరలు భారీగా పెరుగుతున్నాయి.
బంగారం ఇలా భారీ వేగంతో పెరగడం వల్ల సామాన్యుడు బంగారం కొనాలంటేనే బయపడాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం 4 రోజుల్లోనే పసిడి ధర సుమారు రూ.1400 పెరగింది. ఈ 2022 ఫిబ్రవరి నెలలోనే ఏకంగా బంగారం ధర రూ.2 వేలకు పైగా పెరిగింది.
న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల (బిస్కెట్ గోల్డ్ 999) బంగారం ధర సుమారు రూ.600కి పైగా పెరిగి రూ.50,356 కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర రూ.45,561 నుంచి రూ.46,126కు చేరింది.
ఇక దక్షిణాన హైదరాబాద్ లోని బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు కాస్త పెరిగాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.46,300 నుంచి రూ.46,400 పెరిగింది. అంటే ఒక్కరోజులో రూ.100 పెరిగింది. ఇక బిస్కెట్ గోల్డ్ బంగారం ధర రూ.110 పెరిగి రూ.50,620కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.600కి పెరిగి రూ.64,440కి చేరుకుంది.