కోల్కత్తా: ఆదివారం కోల్‌కతాలో జరిగిన మూడవ మరియు చివరి టీ20ఐలో భారత్ వెస్టిండీస్‌పై 17 పరుగుల తేడాతో నెగ్గి టీ20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.
దీని ముందు జరిగిన వన్డే సిరీస్ ను కూడా భారత్ 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది. భారత్ తొలి బ్యాటింగ్ చేసి 184 పరుగులు 5 వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ కు 185 పరుగుల టార్గెట్ ను విధించింది.
భారత్ బౌలింగ్ లో హర్షల్ పటేల్ (3/22), వెంకటేష్ అయ్యర్ (2.1 ఓవర్లలో 2/23), శార్దూల్ ఠాకూర్ (2/33) తమ పదునైన బౌలింగ్ తో భారత విజయానికి బాటలు వేశారు.
వెస్టిండీస్ బ్యాటర్ మరియు వికెట్ కీపర్ నికోలస్ పూరన్ తన చక్కటి ఫామ్‌ను కొనసాగించి వరుసగా మూడో అర్ధ సెంచరీ (47 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్) సాధించాడు, అయినప్పటికీ వెస్టిండీస్ తొమ్మిది వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేయగలిగింది.