మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై కన్నెర్రజేసి మొత్తానికి అనుకున్నంత పని చేశారు. ఉక్రెయిన్ను ఆక్రమించుకోవడమే లక్ష్యంగా తన బలగాలను వేగంగా ముందుకు పంపుతున్నారు. కాగా రష్యా దళాలను అడ్డుకోవడానికి ఉక్రెయిన్ సైన్యం చేస్తున్న ఏ ప్రయత్నాలు ఫలించడం లేదు.
ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించిన రెండో రోజే రష్యా బలగాలను ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి పంపింది. రాజధాని కీవ్‌పైనే ప్రధానంగా గురిపెట్టిన రష్యా, అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి ఆక్రమించాయి.
కీవ్‌ను రష్యా తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అధికారికంగా ప్రకటించారు. మరో 96 గంటల్లో రష్యా చేతుల్లోకి రాజధాని కీవ్ వెళ్లనుందని ఆయన తెలిపారు. వైమానిక దాడులు జరిగే ప్రమాదం ఉందని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని కూడా ఆయన సూచించారు. తనను చంపడమే రష్యా టార్గెట్ అని, తన కుటుంబం హత్యకు ప్లాన్ చేస్తున్నారని అన్నారు.