లక్నో: ఇటీవలే వెస్టిండీస్ పై వన్డే మరియు టీ20ల్లో వైట్ వాష్ చేసిన భారత్ శ్రీలంక తో జరుగుతున్న టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ లో విజయంతో బోణీ చేసింది.
టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ చేయడానికి నిర్ణయించుకుంది. అయితే ఆ నిర్ణయం తప్పు అని ఇషాన్ కిషన్ (89) దూకుడు చూసాక అర్థం అయిఉంటుంది. రోహిత్ కూడా ఆచి తూచి ఆడడంతో భారత్ తొలి వికెట్ కు 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
తరువాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా అర్ధ సెంచరీ నమోదు చేయడంతో భారత్ 199 పరుగులు కేవలం 2 వికెట్లు కోల్పోయి చేసి లంక కు 200 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది.
చేజింగ్ ప్రారంభించిన శ్రీలంక వికెట్లు తక్కువ పరుగుల వ్యవధిలోనే క్రమం తప్పకుండా పడుతూ వచ్చాయి. ఏ దశలోనూ లంక లక్ష్యం వైపు వెళ్ళిన దాఖలాలు లేవు. మొత్తానిక్ శ్రీలంకను భారత్ 137 పరుగులకే పరిమితం చేసింది. దీంతో టీ20 సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంతో ముందంజ లో ఉంది.