తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు కలియుగ దైవం శ్రి వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి సంభంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంభంధించినదిగ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తెలిపింది.
ప్రస్తుతానికి స్వామి వారి దర్శనాలకు ఉన్న నియమాల్లో మార్పులను చేసీంది. ఇక పై ప్రతి శని, ఆదివారాలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
అయితే ఇప్పటికే ప్రతి శుక్రవారం వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ ఇక పై వీఐపీల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకే కేటాయించాలని ఏపీ టీటీడీ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.