న్యూఢిల్లీ: భారత దేశంలోని ప్రభుత్వ భీమా రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) త్వరలో ఐపీఓకు రాబోతోంది. అప్పుడే ఎల్ఐసీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేసింది.
ఈ ఎల్ఐసీ పాలసీదారులు ఐపీఓకి పాలసీహోల్డర్ కోటాలో అప్లై చేయాలంటే తప్పనిసరిగా తమ పాన్ కార్డును పాలసీకి లింక్ చేయాల్సి ఉంటుందని ఎల్ఐసీ గతంలో సూచించింది. ఈ పక్రియను ఫిబ్రవరి 28న పూర్తి చేయాల్సి ఉంటుంది అని తెలిపింది.
బీమా కంపెనీ షేర్ల ధర ఒక్కొక్కటి రూ.2,000 నుంచి రూ.2,100 మధ్య ఉండవచ్చని బ్లూమ్ బెర్గ్ తన అంచనాలో నివేదించింది. దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి మూసాయదా పత్రాలను దాఖలు చేసింది. భారత ప్రభుత్వం తనకున్న 100 శాతం వాటాలో 5% వాటాను విక్రయించి దాదాపు 8 బిలియన్ డాలర్లను సేకరించాలని చూస్తుంది.