fbpx
Saturday, December 21, 2024
HomeNationalకేజ్రీవాల్‌ కీలక నిర్ణయం, రాజ్యసభకు హర్బజన్ సింగ్ నామినేట్!

కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం, రాజ్యసభకు హర్బజన్ సింగ్ నామినేట్!

PUNJAB-AAP-NOMINATES-HARBHAJAN-FOR-RAJYASABHA

ఛండీగఢ్‌: దేశంలోని పలు జాతీయ పార్టీలన్నింటికీ షాకిస్తూ పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించి అక్కడ తొలి సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే పలు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటూ వార్తల్లో నిలుస్తోంది పంజాజ్‌ భగవంత్‌ మాన్ ఆధ్వర్యంలోని సర్కార్‌.

కాగా రాష్ట్రంలో ఇప్పటికే ఉద్యోగాల భర్తీ, అలాగే మంత్రులకు టార్గెట్‌ ఇచ్చిన ఆప్‌ ప్రభుత్వం తాజాగా మరొక సంచలన ప్రకటన జారీ చేసింది. రాజ్యసభకు ఐదు విభిన్న రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను రాజసభ్యకు నామినేట్‌ చేస్తూ దేశ రాజకీయాలలో ఆకర్షణను సాధించింది.

సోమవారం పంజాబ్ రాష్ట్ర ఆప్ ప్రభుత్వం నుంచి ఐదుగురు వ్యక్తులని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. పంజాబ్ కు చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఐదుగురు నూతన సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేసింది.

ఆప్‌ రాజ్యసభ అభ్యర్థులుగా ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, భారత జాతీయ క్రికెటర్ హర్భజన్ సింగ్, ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ సందీప్ పాఠక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పియు) వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ అశోక్ మిట్టల్ మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాలను రాజ్యసభకు నామినేట్ చేసింది.

ఈ స్థానాలకు నామినేషన్ దాఖలు చేయడానికి ఇవాళ చివరి రోజు కాగా మార్చి 31వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఇదిలా ఉండగా, ఢిల్లీలోని రాజేందర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న రాఘవ్ చద్దా అతి చిన్న వయసులోనే రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

ఇక, టీమిండియా ప్రముఖ బౌలర్ అయిన హర్బజన్ సింఘ్ కు క్రీడా రంగంలో చేసిన సేవలను గుర్తించిన ఆప్‌, హర్బజన్ ను తమ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్‌ చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త సంజీవ్‌ అరోరాకు కూడా ఆప్‌ అవకాశం ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular