ముంబై: ఐపీఎల్ 2022 లో కొత్తగా చేరిన జట్ల మధ్య జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ విజయంతో బోణి చేసింది. సోమవారం జరిగిన ఈ పోరులో గుజరాత్ 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేయగా, దీపక్ హుడా (41 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుశ్ బదోని (41 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. షమీ 3 వికెట్లు తీశాడు.
తరువాత గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాహుల్ తెవాటియా (24 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిల్లర్ (21 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు) స్కోరు చేసి జట్టు విజయానికి తోడ్పడ్డారు.