హైదరాబాద్: తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ యొక్క ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన పెండిగ్ చలాన్ల క్లియరెన్స్ స్కీంకు మంచి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న బిల్లులలో 75 శాతం పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చంటూ ట్రాఫిక్ విభాగం ప్రకటించింది.
ట్రాఫిక్ పోలిసులు 2022 మార్చి 1 నుంచి 31 వరకు ఈ ఆఫర్ ను ప్రకటించింది. కాగా ఈ పెండింగ్ ట్రాఫిక్ చలాన్లకు డిజిటల్ పేమెంట్ పార్టనర్‌గా ఉన్న పేటీఎం ద్వారా దాదాపు రూ. 60 కోట్లు వసూలు అయినట్టు పేటీఎం సంస్థ తెలిపింది.
కాగా పేటీఎం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నై, ఫరీదాబాద్, మహారాష్ట్రలతో సహా అనేక ఇతర రాష్ట్రాల్లో ఈచలాన్ ట్రాఫిక్ జరిమానా చెల్లింపు సేవల్లో పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది. పెండింగ్ చలాన్లను ట్రాఫిక్ పోలీసు విభాగం వెబ్‌సైట్‌తో పాటు పేటీఎం యాప్, వెబ్‌సైట్ ద్వారా కూడా చెల్లింపు చేయవచ్చు. ఈ ఆఫర్ కేవలం 2022 మార్చి 31 వరకు మాత్రమే వర్తిస్తుంది.