అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేటి నుండి 26 జిల్లాలతో పునర్వ్యవస్థీకరణ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ 13 జిల్లాలుగా ఉన్న వాటిని ఇప్పుడు 26 జిల్లాలుగా విభజన చేసింది. అలాగే 21 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. దీంతో డివిజన్ల సంఖ్య 51 నుంచి 72కు చేరింది. ఈ మేరకు శనివారం తుది గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది.
దీనికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఇవ్వగా, ఉగాది పర్వదినాన శనివారం తుది నోటిఫికేషన్ ఇచ్చింది. 1974 ఏపీ డిస్ట్రిక్ట్ (ఫార్మేషన్) చట్టం ప్రకారం ఈ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. అంతకుముందు శనివారం సాయంత్రం తుది నోటిఫికేషన్‌లో కొద్దిపాటి మార్పులకు రాష్ట్ర మంత్రివర్గం వర్చువల్‌గా ఆమోదముద్ర వేసింది.
26 జిల్లాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీన, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, , అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు మరియు నంద్యాల.