పూణే: ఐపీఎల్ 2020లో మొదటి మ్యాచ్ ఓడిపోయిన తరువాత కోలుకున్న రాయల్ చాలెంజర్స్ దాని తరువాత వరుసగా మూడు మ్యాచ్ లలో విజయాన్ని సాధించింది. మరో వైపు ఇప్పటికి ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది.
శనివారం ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఆర్‌సీబీ 7 వికెట్లతో ముంబైని చిత్తుగా ఓటమి పాలు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ముంబై బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగడంతోనే ముంబై ఆ మాత్రం స్కోరు సాధించింది.
తదుపరి బ్యాటింగ్ చేసిన బెంగళూరు 18.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 152 పరుగులను సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనూజ్ రావత్ (47 బంతుల్లో 66; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (36 బంతుల్లో 48; 5 ఫోర్లు) రెండో వికెట్‌కు 80 పరుగులు (52 బంతుల్లో) జోడించి జట్టు విజయాన్ని సునాయాసంగా మార్చారు.