అమరావతి: ఇటీవలే ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో నెల్లూరు సంగం బ్యారేజికి గౌతంరెడ్డి పేరు పెడతానాని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
కాగా ఇవాళ ఆ సంగం బ్యారేజీకీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరును పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌గా సంగం బ్యారేజీకి నామకరణం చేశారు.