మూవీ డెస్క్: తెలుగు చిత్రాల ప్లాట్ ఫాం అయిన టాలీవుడ్‌లో ఎలాంటి వారసత్వం మరియు బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వయంగా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పూడు స్టార్ హీరోలలో ఒకరుగా ఎదిగిన స్టార్ మాస్ మహారాజా రవితేజ.
తన టాలీవుడ్ కెరీర్ ప్రారంభంలో లభించిన అన్ని రకాల చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు ఒక స్టార్ హీరోగా తన సత్తా చాటుతున్న రవితేజకు కొడుకు మహాధన్. కాగా మహాధన్ ఇటీవల రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో రవితేజ చిన్నప్పటి రోల్‌లో మహాధన్ కనిపించాడు.
అయితే ఇక అప్పటి నుండి హీరోగా రవితేజ కొడుకు ఎంట్రీ త్వరలో ఉండబోతున్నట్లు వార్తలు పుట్టుకొస్తున్నాయి. దీనిపై స్పందించిన రవితేజ అతని చదువు పూర్తవగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని ఇదివరకే తెల్పిఆరు.
కాగా తాజాగా కాలేజీ నేపథ్యంలో సాగే ఒక యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ని మహాధన్‌తో తీయడానికి రవితేజను సంప్రదించగా ఆయన కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రాజా ది గ్రేట్ సినిమాతో రవితేజకు హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రావాల్సి ఉంది.