న్యూఢిల్లీ: దేశంలో ఒకే సారి 657 రైళ్ళను రద్దు చేస్తూ భారతీయ రైల్వే పెద్ద నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం పలు రాష్ట్రాలు కరెంట్ కోతలతో ఇబ్బంది పడడమే అని తెలుస్తోంది.
కాగా బొగ్గు సరఫరా చేసే రైళ్ళ వేగం పెంచడం కోసం 509 ఎక్స్ ప్రెస్స్ మరియు 148 మెము రైళ్లను రద్దు చేస్తున్నట్లు అలాగే ప్రతి రోజు పరిస్థితి కి తగినట్లు నిర్ణయం తీసుకుని పునరుద్ధరిస్తామని రైల్వే శాఖ తెలిపింది.
అయితే రైల్వే శాఖ కేవలం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా లెని రైళ్ళను మాత్రమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజా పరిస్థితులను బట్టి రైళ్ళ పునరుద్ధరణ నిర్ణయం ఉంటుందని తెలిపింది.