హైదరాబాద్: ఇండియా లో ఒకప్పుడు సౌత్ మూవీస్ అంటే తమిళ్ మూవీస్ మాత్రమే అని ఉండేది. తెలుగు లో మంచి సినిమాలు రాకనో, వచ్చిన సినిమాలకి అంతగా గుర్తింపు రాకనో తెలియదు లేదా తమిళ్ సినిమాల క్రియేటివిటీకి మన సినిమాలు దగ్గర కూడా రీచ్ అవకపోయి ఉండొచ్చు. కానీ ఇపుడు పరిస్థితి మారింది. ఇపుడు సౌత్ లో అన్ని భాషల్లో కొత్త టాలెంట్ పరిమితులు లేకుండా దూసుకెళ్తుంది. ఒక విధంగా చెప్పాలంటే కేవలం ఇండియన్ ఆడియన్స్ ఏ కాకుండా వరల్డ్ ఆడియన్స్ కూడా గుర్తించే స్టేజి కి మన తెలుగు సినిమా రీచ్ అయింది. ఇపుడు ఇదంతా ఎందుకు చెప్పుతున్నాం అంటే గత కొన్ని సంవత్సరాలుగా మన దగ్గరినుండి బాలీవుడ్ కి ఎగుమతి అవుతున్న టెక్నిషియన్స్ సంఖ్య పెరగడమే.
ఇదివరకి ఎపుడో ఒక సినిమానో లేదా ఒక డైరెక్టర్ ఇక్కడ బాగా సక్సెస్ అయిన తర్వాత బాలీవుడ్ కి వెళ్లడం లాంటివి జరిగేది. అందులో బాగా సక్సెస్ అయినవాళ్ల లిస్ట్ తీస్తే రామ్ గోపాల వర్మ ఒక్కడే కనపడతాడు. కానీ ఇప్పుడు తెలుగు కథలు కుప్పలుగా అక్కడ రీమేక్ అవుతున్నాయి. కొన్ని రీమేక్ చేసే సినిమాలకి కూడా మాతృక డైరెక్టర్నే తీసుకోవడం విశేషం. డైరెక్ట్ హిందీ సినిమాలకి కూడా విజయేంద్ర ప్రసాద్ లాంటి తెలుగు రచయితలు కథ రాయటం అవి బ్లాక్ బస్టర్ కూడా అయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్ నుండి అర్జున్ రెడ్డి డైరెక్టర్ ‘సందీప్ వంగ’, జెర్సీ డైరెక్టర్ ‘గౌతమ్ తిన్ననూరి’, గూఢచారి డైరెక్టర్ ‘శశి కిరణ్ తిక్క’, మత్తు వదలరా డైరెక్టర్ ‘రితేష్ రానా’, హిట్ డైరెక్టర్ ‘శైలేష్ కొలను’ ఈ కొత్త డైరెక్టర్స్ అందరూ కేవలం ఒక్క సినిమా అనుభవం తోనే బాలీవుడ్ ఆఫర్స్ కొల్లగొడుతున్నారు. కొందరు ఆల్రెడీ బాలీవుడ్ లో సినిమా తీసి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో దుమ్ము కూడా లేపారు. వీరితో పాటు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, క్రిష్ జాగర్లమూడి, సాహో డైరెక్టర్ సుజీత్, రాధే శ్యామ్ డైరెక్టర్ రాధ కృష్ణ కూడా పాన్ ఇండియా డైరెక్టర్స్ అన్నట్టే చెప్పుకోవాలి. ఇలా కొత్త తరం డైరెక్టర్స్, కొత్త తరహా లో సినిమా తీసే డైరెక్టర్స్ అందరూ బాలీవుడ్ బాటలో వెళ్లి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. కానీ అక్కడ కూడా రీమేక్ లు కాకుండా కొత్త సినిమా చేసుంటే ఆ డైరెక్టర్ పనితనం మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో రుజువయ్యే అవకాశాలు ఉండేవి.
ikkada talent ni tokkestunnaru ani akkadiki elthunnaremo