నిర్మల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిని ఇవాళ బాసర పోలీసులు అరెస్ట్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ డిమాండ్ల సాధన కోసం కళాశాలలో నిరసనలు కొనసాగిస్తున్నారు.
కాగా ఈ క్రమంలో శుక్రవారం బాసరకు చేరుకున్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అక్కడి పోలీసుల వలయాన్ని ఛేదించి రహస్యంగా ట్రిపుల్ అఈటీ గోడ దూకి మరీ లోనికి ప్రవేశించారు.
అక్కడి నుండి ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వద్దకు రేవంత్ రెడ్డి చేరుకుని విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, రేవంత్ ను అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించగా అక్రమ అరెస్టుపై ఆయన మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.