డబ్లిన్: టీమిండియా ఐర్లాండ్‌తో జరగిన తొలి టీ20 మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ను చిత్తు చేసింది. మ్యాచ్ మొదలవక ముందే వర్షం పలకరించి మ్యాచ్ కు అంతరాయం కల్పించింది.
కాగా వర్షం తో ఆలస్యం అవడంతో మ్యాచ్ ను ఇరువైపులా 12 ఓవర్లకు కుదించిగా టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత ఐర్లాండ్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఐర్లాండ్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా భారత బౌలర్లలో భువీ, పాండ్యా, అవేశ్, చహల్ తలా ఒకొక్క వికెట్ తీశారు. 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. భారత బ్యాటర్లలో దీపక్ హుడా(47), ఇషాన్ కిషన్(26), హార్ధిక్ పాండ్యా(24) పరుగులతో రాణించారు.