బెంగళూరు: మద్యం మత్తు వల్ల కిక్ రావడం అటుంచితే దాని వల్ల జీవితాలే నాశనవుతున్నాయి. మన భారత దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 8,500 డ్రగ్స్, మద్యం వ్యసనపరులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
కాగా ఈ ఆత్మహత్యలు చేసుకునే వారిలో యువతే అత్యధికం. పేదరికం, నిరుద్యోగం, కుటుంబ కష్టాలు వంటివాటి కంటే డ్రగ్స్, మద్యమే మన దేశంలో ఎక్కువ ప్రాణాలను బలిగొంటున్నాయి.
కాగా ఆత్మహత్యల విషయంలో ఏ కారణం చేత ఎంత మంది చనిపోతున్నారంటే: ప్రేమ విషయంలో 4.5 శాతం మంది, వైవాహిక ఇబ్బందులతో 5.5 శాతం మంది బలవుతున్నారు. 5.6 శాతం మంది మత్తు, మద్యం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఇదిలా ఉండగా డ్రగ్స్ ఆత్మహత్యల్లో 6,745 మందితో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంటే, కర్ణాటక 3,840 మందితో రెండో స్థానంలో నిలవడం గమనార్హం. తదుపరి తమిళనాడు 3,452 మందితో మూడోస్థానంలో ఉంది.
కర్ణాటకలో గత మూడు సంవత్సరాల్లో మొత్తం 35,099 ఆత్మహత్య కేసులు నమోదు కాగా ఇందులో 3,840 మంది మత్తు, మద్యానికి బానిపై ప్రాణాలు తీసుకున్నట్లు కేంద్రప్రభుత్వం తమ నివేదికలో వెల్లడించింది.