న్యూఢిల్లీ: రోహిత్ శర్మకు పనిభారం తగ్గించడానికి టీ20 కెప్టెన్సీ నుంచి విముక్తి కల్పిస్తూ మరో ఆటగాడికి పగ్గాలు అప్పజెప్పుతున్నారా, అంటే కాదు అనే సమాధానాలే వినిపిస్తోంది బీసీసీఐ.
అయితే, భారత్ కు వరుస సిరీస్‌లు ఉన్నపుడు మాత్రం రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించి అతడి స్థానంలో ఇకపై స్టార్ ఆల్‌రౌండర్‌కు ఆ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించే ఆలోచనలో బీసీసీఐ ఉందని సమాచారం!
ఆ ఆల్రౌండర్ ఐపీఎల్-2022తో తొలిసారిగా కెప్టెన్‌గా ప్రయాణం ప్రారంభించిన హార్దిక్ పాండ్యా. సీజన్‌లోనే తొలి సారిగా అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్‌ను చాంపియన్‌గా నిలిపి ప్రశంసలు అందుకున్నాడు పాండ్యా. ఈ క్రమంలో ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌కు సారథిగా ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్‌లోనే 7 వికెట్ల తేడాతో జట్టును గెలిపించి మధుర జ్ఞాపకాలు మిగుల్చుకున్నాడు.