హరారే:భారత్ జింబాబ్వే మధ్య హరారేలో జరిగిని రెండవ టీ20 మ్యాచ్ లో భారత్ అధ్బుత విజయం సాధించింది. మొదటి మ్యాచ్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టూ 234 పరుగుల భారీ స్కోరు సాధించింది.
జింబాబ్వే జట్టు కేవలం 134 పరుగులకే ఆలౌట్ అయి ఓటమి పాలయింది. భారత్ తరఫున అభిషేక్ శర్మ కేవలం 47 బంతుల్లో 100 పరుగులు చేసి మరుసటి బంతికే అవుటయ్యారు.
రుతురాజ్ 77 పరుగులతో, రికూ సింగ్ 48 పరుగులతో చెలరేగి ఆడటంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
ఛేజింగ్ ప్రారంభించిన జింబాబ్వే ఏ దశలోనూ ఛేదించే స్థాయికి చేరుకోలేదు. వెస్లే మాత్రమే 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
బ్రియాన్ 26, ల్యూక్ 33 పరవాలేదనిపించినా అప్పటికే మ్యాచ్ చేజారింది.
ముకేష్ కుమార్, ఆవేశ్ ఖాన్ చెరో 3 వికెట్లు, రవి బిష్ణోయ్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీసుకుని జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చారు.
మొదటి మ్యాచ్ గెలిచిన ఆనందం జింబాబ్వే కి ఎక్కువ సేపు లేకుండా చేసింది టీమిండియా. ఈ విజయంతో 5 మ్యాచ్ ల సిరీస్ 1-1 తో సమం అయింది.
సిరీస్ లో 3వ మ్యాచ్ 10వ తేదీన హరారే లో జరగనుంది. సిరీస్ లో ని తదుపరి మ్యాచ్ లు 13 మరియు 14వ తేదీన హరారే వేదికగానే జరగనున్నాయి.
తదుపరి మ్యాచ్ ల ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.