ముంబయి: అనుకున్నట్లుగానే టీమిండియా నూతన కోచ్ గా గౌతం గంభీర్ నియమితులయ్యారు. గత కొన్ని రోజులుగా ఉత్కంఠ మధ్యన సాగుతున్న ఈ వ్యవహారం ఎట్టకేలకు తేలింది. బీసీసీఐ తాజాగా గంభీర్ ను టీమీండియా కోచ్ గా నియమించింది.
టీ20 వరల్డ్ కప్ తో రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగియగా తాను తిరిగి కొనసాగడానికి సుముఖంగా లేకపోవడం వల్ల ఇటీవల బీసీసీఐ టీమిడియా కోచ్ గా పలువురిని ఇంటర్వ్యూ చేసి చివరకు గౌతం గంభీర్ ను ఎంపిక చేసింది.
కాగా గంభీర్ ముందు చాల పెద్ద సవాళ్ళు ఉన్నాయి: 2025 లో ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్లు, ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, 2026లో టీ20 ప్రపంచ్ కప్, న్యూజిలాండ్ తో 2 టెస్టులు, 2027లో వరల్ద్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, 2027లో వండే ప్రపంచకప్ ఉన్నాయి.
ఇదే సందర్భంలో ప్రస్తావించాల్సిన అతి ముఖ్య విషయం, విరాట్ కోహ్లీ మరియు గౌతం గంభీర్ మధ్య ఉన్న వివాదాలు. ఐపీఎల్ లో ఇద్దరి మధ్య పలు సందర్భాల్లో వాగ్వాదాలు జరిగాయి. కాగా ఈ ఏడాది ఐపీఎల్ లో ఇద్దరి మధ్య సమస్యలు సద్ధుమనిగినట్లే అనిపించింది. మరి గంభీర్ నేత్రుత్వంలో విరాట్ కోహ్లీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అనేది వేచి చూడాలి.