ముంబయి: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిని పడ్డారు. ఆయన గత కొన్ని రోజులుగా తన తాజా మూవీ అయిన సర్ఫిరా కోసం ప్రమోషన్స్ కోసం పలు కార్యక్రమాల్లో భాగంగా బయట ఎక్కువగా తిరుగుతున్నారు.
తాజాగా ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అక్షయ్ వైద్యుల సూచనల మేరకు ఐసోలేషన్ లో ఉన్నారు. ఆయన అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ ల వివాహ కార్యక్రామానికి కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది.
కాగా అక్షయ్ కుమార్ నటించిన సర్ఫిరా మూవీ ఈ రోజు థియేటర్లలో విడుదల అయింది.