అమరావతి: మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషన్ కూ సిఈవో గా పని చేసిన ఐఏఎస్ అధికారి ముకేశ్ కుమార్ మీనాకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక శాఖలకు బదిలీ చేసింది.
ఆయనను ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఎక్సైజ్ శాఖతో పాటుగా గనులశాఖకు కూడా తనను ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఈ నేపథ్యంలో ముకేశ్ కుమార్ మీనా నిన్న సాయంత్రం ఏపీ సీఈవోగా రిలీవ్ అయ్యారు.
కాగా ఏపీ సీఈవో గా ముకేశ్ కుమార్ స్థానంలో వివేక్ యాదవ్ ని ప్రభుత్వం నియమించింది. ముకేశ్ కుమార్ మీనా మే నెలలో జరిగిన ఎన్నికల్లో అక్రమాలను ఎదుర్కోని చాలా సమర్థంగా పనిచేశారన్న ప్రశంసలు లభించాయి.
అందుకు ప్రభుత్వం ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఏపీ సీఈవో గా నూతనంగ నియమితులైన వివేక్ యాదవ్ మొన్నటి వరకు సీఆర్డీయే కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు.