న్యూఢిల్లీ: దేశం మొత్తం మీద 7 రాష్ట్రాల్లో, 13 నియోజకవర్గాలకు గాను జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి 10 స్థానాలను కైవసం చెసుకుంది. బీజేపీ 2 సీట్లకు పరిమితం అయింది.
పంజాబ్ లోని జలంధర్ లో ఆప్ 1 సీటులో విజయం సాధించింది. కాగా హిమాచల్ ముఖ్యమంత్రి భార్య కూడా గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. పశ్చిమ బెంగాల్ లో టీఏంసీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంది.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సొంత మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థుతుల్లో ఉన్న బీజేపీ కి ఈ ఫలితాలు రుచించకపోవచ్చు. ఐతే కాంగ్రెస్ పోటి చేసిన అన్ని ఎలక్షన్లలో బీజేపీకి షాక్ ఇస్తూ వస్తోంది.