న్యూఢిల్ల్: ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 2017 నుండి తమ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ రికీ పాంటింగ్ ను కోచ్ గా తప్పించింది. ఇన్నాళ్ళు జట్టుకు కోచ్ గా వ్యవహరించినందుకు ధన్యవాదాలు తెలిపింది.
ఢిల్లీ క్యాపిటల్స్ గత కొన్ని సీజన్లగా పేలవ ప్రదర్శనతో కనీసం ప్లే ఆఫ్స్ దాటీ ముందుకు వెళ్ళలేక పోతోంది. 2024 ఐపిఏల్ లో కూడా 6వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అందుకే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మరో వైపు ఢిల్లీ క్యాపిటల్స్ కు డైరెక్టర్ గా పని చేస్తున్న సౌరవ్ గంగూలీ టీం కోచ్ గా బాధ్యతలు కూడా తనకే అప్పచెప్పాలని కోరినట్లు సమాచారం. అదే జరిగితే ఢిల్లీ ప్రదర్శనలో మార్పులు ఆశించవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.