హైదరాబాద్: తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న రైతు రుణమాఫీ కి సంబంధించి ముఖ్యమైన సమాచారం అందించింది.
సోమవారం రోజున రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీకి మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 2 లక్షల వరకు మాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ తెలిపింది.
2018 డిసెంబర్ 12 వ తేదీ నుండి 2023 డిసెంబర్ 13వ తేదీ వరకు తీసుకున్న రూణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని తెలిపింది. దీని కోసం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రకటించింది.