న్యూ ఢిల్లీ: అమెజాన్ ఇండియాలోని ఉత్పత్తి అమ్మకందారులు తమ లిస్టింగ్స్ లో ఆ వస్తువు ఏ దేశంలో తయారు జరిగింది అనే విషయాన్ని ఖచ్చితంగా ఆగస్టు 10 లోగా ప్రదర్శించాలని ఇ-కామర్స్ దిగ్గజం అమ్మకందారులకు ఇమెయిల్ పంపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయం ప్రతిపత్తి గల దేశం కోసం ముందడుగు వేయాలని పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఉత్పత్తి జాబితాల పక్కన ఆ ఉత్పత్తి ఏ దేశంలో తయారు అయ్యాయనే విషయాన్ని ఇ-కామర్స్ సైట్‌లో ప్రదర్శించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
భారతదేశం మరియు చైనా మధ్య హింసాత్మక సరిహద్దు ఘర్షణ తరువాత గత నెలలో 59 చైనా-మూల యాప్ లను భారత ప్రభుత్వం నిషేధించింది మరియు పోర్టులలో చైనా తయారు చేసిన వస్తువులను పట్టుకుంది. అంతేకాకుండా, వర్తక సంఘాలు చైనాలో తయారు చేసిన ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి.
అమేజాన్ తన అమ్మకందారులకు ఆగష్టు 10వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు జూలై 15న ఈమెయిల్ పంపింది. అయితే వారు ప్రచురించే సమాచారం ఖచ్చితమైనదై ఉండాలని, అలానే వారు ఇచ్చే సమాచారానికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది.