గోండా: ఉత్తరప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గోండా – మాంకాపూర్ సెక్షన్ లో చండీఘర్ – డిబ్రూగడ్ రైలు (నం. 15904) పట్టాలు తప్పింది.
కాగా, ఈ ప్రమాదంలో 10 బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. ఇప్పటికే సహాయ చర్యలు మొదలయ్యాయి. అయితే, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.