అమరావతి: ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత పలు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు రాజీనామాలు సమర్పించి తమ పదవుల నుండి తప్పుకున్నారు.కాగా, ఇవాల రాష్ట్ర ప్రభుత్వం పలు విశ్వవిద్యాలయాలకు నూతన ఉపకులపతుల నియమాకం ఉత్తర్వులు జారీ చేసింది.
కాకినాడ జేఎన్టీయూకు ఉపకులపతిగా ప్రొఫెసర్ కేవీసీజీ మురళీకృష్ణ, రాజమండ్రి ఆదికవి నన్నయ్య వర్శిటీ ఉపకులపతిగా ప్రొఫెసర్ వై శ్రీనివాసరావు, నెల్లూరు విక్రమ సింహపురి వర్శిటీ ఉపకులపతిగా ప్రొఫెసర్ సారంగం విజయభాస్కర్ రావు నియమితులయ్యారు.
ఒంగోలు ఆంధ్రకేసరి వర్శిటీ ఉపకులపతిగా డీవీఆర్ మూర్తి, కర్నూలు అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీ ఉపకులపతిగా పటాన్ షేక్ షావల్లీ ఖాన్, కడప యోగి వేమన వర్శిటీ ఉపకులపతిగా కె. కృష్ణారెడ్డి నియమితులయ్యారు.
ఇక బందరు కృష్ణావర్శిటీ ఉపకులపతిగా ఆర్ శ్రీనివాసరావు, కర్నూలు రాయలసీమ వర్శిటీ ఉపకులపతిగా ఎన్టీకే నాయక్, కుప్పం ద్రవిడ వర్శిటీ ఉపకులపతిగా దొరైస్వామి, కడప వైఎస్సార్ ఆర్కిటెక్చర్ వర్శిటీ ఉపకులపతిగా విశ్వనాథ కుమారు నియమితులయ్యారు.
ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి ఇన్ ఛార్జ్ ఉపకులపతిగా ప్రొఫెసర్ చిప్పాడ అప్పారావు, ఎస్కేయూ, అనంతపురం ఉపకులపతిగా ప్రొఫెసర్ బి అనిత, ఆంధ్రా వర్శిటీ, విశాఖ ఉపకులపతిగా ప్రొఫెసర్ గొట్టాపు శశిభూషణ్ రావు నియమితులయ్యారు.
నాగార్జున వర్సిటీ, గుంటూరు ఉపకులపతిగా ప్రొఫెసర్ కంచర్ల గంగాధర్, జేఎన్టీయూ, అనంతపురం ఉపకులపతిగా హెచ్. సుదర్శనరావు, పద్మావతి మహిళా వర్శిటీ, తిరుపతి ఉపకులపతిగా ప్రొఫెసర్ వి.ఉమ, జేఎన్డీయూ,విజయనగరం గురజాడ వర్శిటీ ఉపకులపతిగా ప్రొఫెసర్ డి రాజ్యలక్ష్మిని నియమించారు.