ముంబై: ఊహించినట్లుగానే భారత్ టీ20 టీం కి కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ను బీసీసీఐ నియమించింది. రోహిత్ శర్మ ఉన్నంత వరకు వైస్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ తదుపరి కెప్టెన్ అని అందరూ భావించారు.
ఐతే బీసీసీఐ అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. హార్దిక్ ను వైస్ కెప్టెన్ గా కుడా కొనసాగించలేదు. టీమిండియాకు వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ను నియమించింది.
ఈ నిర్ణయానికి గౌతం గంభీర్ కారణం అని తెలుస్తోంది. వర్క్ లోడ్ ఎక్కువ లేని ప్లేయర్ కెప్టెన్ అయితే జట్టును బాగా మేనేజ్ చేయగలరని గంభీర్ సూర్యను ఎంపిక చేసినట్లు సమాచారం.
అలాగే, హార్దిక్ పాండ్యా టీం లో పెద్ద ఆల్రౌండర్ అవడం వల్ల అతనికి ఒత్తిడి తగ్గించడమే ఉద్దేశాన్ని గౌతం గంభీర్ బీసీసీఐ దగ్గర ప్రస్తావి ఉండొచ్చని క్రీడా విశ్లేషకుల అభిప్రాయం.
కాగా, వన్డే టెస్టులకు రోహిత్ శర్మనే కెప్టెన్ గా కొనసాగుతారని బీసీసీఐ తెలిపింది. రోహిత్ శర్మ, విరాట్ రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల టీ20లో నూతన కెప్టెన్ ప్రస్తావన వచ్చింది.