ముంబై: హార్దిక్ పాండ్యా, నటాషా విడిపోతున్నట్లు ధృవీకరించారు. ఈ జంట పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
“4 సంవత్సరాల పాటు కలిసి ఉన్న తర్వాత, ఇద్దరమూ పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు గురువారం సాయంత్రం హార్దిక్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపాడు.
మేము కలిసి ఉండడానికి మా వంతు ప్రయత్నం చేసాము. కానీ అది విజయవంతం కాలేదు. అందుకె పరస్పర అంగీకారంతో విడిపోతున్నాము. మా అబ్బాయి అగస్త్యను ఇద్దరమూ చూసుకుంటాము, అలాగే అతని సంతోషానికి కావల్సినవి కలిసి నిర్వర్తిస్తాము.
మా నిర్ణయాన్ని గౌరవిస్తూ మా గోప్యతకు సహకరిస్తారని, ఈ సమయంలో మాకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నాను అని హార్దిక్ పోస్ట్ చేశారు.