హైదరాబాద్: ఇన్నాళ్ళు లేఆఫ్స్ అనే పదం విని భయపడ్డ ఐటీ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ తియ్యటి కబురు చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 20 వేల మందిని నియమించనున్నట్లు తెలిపింది.
గత 6 నెలలుగా ఇన్ఫీలో ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఈ ఏడాది జూన్ త్రైమాసానికి ఉద్యోగుల సంఖ్య దాదాపు 3.15 లక్షలుగా ఉంది.
అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం భారీగా నియమాకాల్ని చేపట్టనున్నట్లు సంస్థ పేర్కొంది. నియమాకాల్లో తాజా పట్టభద్రుల కోసం ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది.