డంబుల్లా: శుక్రవారం డంబుల్లాలో బద్ధ శత్రువైన పాకిస్థాన్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ ఘన విజయం సాధించింది. భారత మహిళల టీ20 జట్టు ఆసియా కప్ టైటిల్ డిఫెన్స్‌ను విజయంతో ప్రారంభించింది.
టాస్ ఓడి బౌలింగ్ చేసిన భారత్ పాకిస్తాన్‌ను 108 పరుగులకే కట్టడి చేసింది, ఆపై 35 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
109 పరుగుల ఛేదనలో భారత ఓపెనర్లు షఫాలీ వర్మ (40), స్మృతి మంధాన (45) తమ అత్యుత్తమ ప్రదర్శనతో పాక్ దాడికి ధీటుగా నిలిచారు.
ఇద్దరు ఓపెనర్స్ ఫోర్లు, సిక్సుల దూకుడు ప్రదర్శన కొనసాగింది. మంధాన, షఫాలీ ద్వయం తుబా హసన్ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో ఆరో ఓవర్‌లో 15 పరుగులు చేసింది.
హసన్ వేసిన ఏడో ఓవర్‌లో మంధాన ఐదు బౌండరీలతో 21 పరుగులు రాబట్టారు. దీప్తి శర్మ 3 వికెట్లు, పూజా రేణుక మరియు శ్రేయాంకా చెరో 2 వికెట్లు తీసి పాకిస్తాన్ ను 108 కే కట్టడి చేశారు.