కర్నూలు: ఎప్పుడు అనుచిత వ్యాఖ్యలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఇటీవల ఆమె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితపై సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఈ నేపథ్యంలో మంత్రులపై అసభ్య పదజాలం ఉపయోగించారని పోలీసులకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాజు (బీసీ సెల్) ఫిర్యాదు చేశారు.
ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగే శ్రీరెడ్డి యూట్యూబ్, ఫేస్ బుక్ లో మాట్లాడినందుకు చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నేరానికి గానూ శ్రీరెడ్డికి శిక్ష పడేలా చూడాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. కాగా, రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీరెడ్డిపై కేసును నమోదు చేశారు.