న్యూఢిల్లీ: భారత దేశంలో కరోనా కేసులు 10 లక్షలకు పైగా నమోదయ్యాయి. ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్న నేపథ్యంలో లాన్సెట్ అనే మెడికల్ జర్నల్ దేశంలో కరోనా విషయంలో అత్యంత ప్రమాదకరమైన జిల్లాలు కలిగిన రాష్ట్రాల జాబితాను ప్రకటించింది.
ఈ జాబితా లో తెలంగాణ, మధ్యప్రదేశ్, బిహార్ లోని అత్యధిక జిల్లాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రకటించింది. మొత్తం మీద దేశంలో 9 రాష్ట్రాలలో ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉందని ప్రకటించిది.
ఈ రాష్ట్రాలలోని హౌసింగ్, పరిశుభ్రత మరియు వైద్య వ్యవస్థను ఆధారంగా తీసుకుని చేసిన అధ్యయనం లో ఈ సూచనలు చేస్తున్నాట్లు ప్రకటించింది.
అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తల ప్రకారం తెలంగాణ, మధ్యప్రదేశ్, బిహార్ తరువాత గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా ఉన్నాయి.
అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తల ప్రకారం తెలంగాణ, మధ్యప్రదేశ్, బిహార్ తరువాత గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా ఉన్నాయి. ఈ అధ్యయనంలో వైరస్ వ్యాప్తి, కేసుల సంఖ్య, మరణాలు, సామాజిక, ఆర్ధిక ప్రభావాలతో సహా సంక్రమణ పరిణామాలను పరిశీలించినట్టు తెలిపింది.
అతి తక్కువ ప్రభావం గల రాష్ట్రంగా సిక్కిం నిలివగా, అరుణాచల్ ప్రదేశ్ , హిమాచల్ ప్రదేశ్ కూడా తక్కువ ప్రభావిత రాష్ట్రాలుగా ఉన్నాయి.